అక్షరం ఒక సృష్టి
అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క
లక్ష మెదళ్ళకు కదలిక అని కాళోజీ గారన్నట్లుగా,
అక్షరమే వెలుగై
నీలోని అజ్ఞాన చీకట్లను పారద్రోలి,
జ్ఞాన జ్యోతులను ప్రసాదించి,
నీ జీవితానికి మార్గం చూపిస్తుంది
అక్షరమే నీకు ఆయుధమై,
జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏకరువు పెడుతూ,
సమస్యా పరిష్కారం చూపుతూ,
మనిషిగా ఉన్న నిన్ను మహనీయునిలా మార్చుతుంది.
అక్షరమే చైతన్యమై,
సమాజంలోని కుళ్ళును కడిగేస్తూ
దోపిడీని, దారిద్య్రాయన్ని నిరసిస్తూ,
దిశా నిర్దేశం చేస్తూ, బాసటగా నిలుస్తుంది.
అక్షరం ఒక అగ్నికణం
అక్షరం ఒక శక్తి,
అక్షరం ఒక యుక్తి,
అక్షరం ఒక సృష్టి,
అక్షరం ఒక ప్రభంజనం,
అక్షరమే సర్వస్వం.
అక్షరమే ఊపిరిగా,అక్షరమే శ్వాసగా
కవులు తమ కలాన్ని పదును పెడుతూ
తమ రచనల రూపంలో గళాన్నివినిపిస్తూ
తెలుగు సాహిత్యాభివృద్ధికిపాటుపడుతూ
సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తూ
లక్షల ఆయుధాలు చేయలేని పని ఒక అక్షరం చేస్తుంది అని నిరూపిస్తూ,
ప్రభుత్వానికి,ప్రజల మధ్య వారధిగా ఉంటూ అక్షరమే పరమావధి అవుతుంది.
అక్షరమే నీ ఆయుధమైతే విజయం నిన్ను వరిస్తుంది,
అక్షరమే నీ ఆయుధమైతే తెలుగు ఇజం నిన్ను ప్రోత్సహిస్తుంది.
Also Read : ‘అక్షర’మే నా ఆయుధం