A lesson learned from experience : కాలం అనుభూతుల నుంచి నేర్చిన పాఠం

అనుభవం - గుణపాఠం

 

అనుభవం – గుణపాఠం

అలసిన సూరీడు, ఎర్రగా కందిపోయిన మొహంతో పడమట వాకిట తెరుచుకొని, ఇంటికేగే వేళలో, రామారావు ఆఫీస్ నుంచి
ఇంటి వీధి గుమ్మంలోకి వచ్చి, ఏమేవ్!తలుపు తీయవే అని అరిచాడు. ఆ వస్తున్నానండి అంటూ, పరుగునవచ్చి, తలుపుదీసి, అయిందా ఉద్యోగం అంటూ, మంచి నీళ్లు అందించింది భార్య సీతమ్మ.

పడక్కుర్చిలో నడుం వాలుస్తూ, రామారావు అదికాదే,అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ గాని చేసాడా అనగానే, లేదండి!నేను అదే చూస్తున్నానండి అంది ఆమె.నాకు తెలీక అడుగుతాను,పిల్లలు ఎందుకని మన గురించి ఆలోచించరండీ?అయ్యో ఎదురుచూస్తుంటారు అని అనుకోరా అంది సీతమ్మ!బాధపడకే, వాళ్ల బతుకులు కాలం చేతిలో కీలుబొమ్మలు అయ్యాయె నేడు,అని సర్ది చెప్పారు.

తరువాత రామారావు ఆలోచనల గతంలోకి,జారుకున్నాడు. అమ్మా, నాన్న, అన్నా, వదిన, చెల్లి, బంధువుల మధ్య ఎంత ఆనందంగా గడిపామో కదా బాల్యంలో.ప్రేమగా పలకరించే బంధువులు, అభిమానం తో అలరించే స్నేహితులు, పండగలు, పేరంటాలు, సందళ్ళు. డబ్బులు కోసం కాకుండా, మనుషుల కోసం ఏడ్చే రోజులు కదా అవి.

ఒకరి కష్ట సుఖాల్లో, అందరూ పలుపంచుకొనే, మనసులుగల మనుషులు ఉండేవారుగా అప్పుడు కాని నేను, ఏమి చేశాను. నా పిల్లల చదువుల కోసం పట్నం వచ్చా, బాగా సంపాదించాలని పిల్లలకి నూరిపోస్తూ, నేడు విదేశాలకి వాళ్లని పంపి ఏమి సాదించాను?

వారి గొంతువినే ఫోన్ కోసం, ఎదురుచూస్తూ, కనీసం ఎపుడు కలుస్తామో కూడా తెలీని, అనిశ్చితి లో బతుకులు వెళ్ళదీస్తున్నాం.అనుభవాన్ని మించిన గుణ పాఠం లేదు.

కాలం మిగిల్చిన అనుభూతుల నుంచి నేను నేర్చిన పాఠం, కష్టమైన నష్టమైన, కలిసి ఉండడంలో వున్న ఆనందం అపురూపం. మట్టి లో కలిసే మనుషులకు, ఎంత సంపాదన వున్నా,ఏమిటి లాభం? ఒంటరి పక్షులు సైతం, ఎగిరి ఎక్కడికెళ్లిన ఒక గూటికి చేరతాయి.

అందుకే, ఆత్మ తృప్తి, అన్నిటా మంచిని చూడగలిగే విశాల దృక్పధం,అలవర్చుకోవడం అందరికి అవసరం. ఆశల తీరాల వెంట అర్థం లేని పరుగులాట మానాలని, నేటి యువతకు నేర్పితేనే, సమామాజానికి శాంతి లభిస్తుందేమో, అని ఆలోచనలో విహరిస్తుంటే, ఇదిగో కాఫీ, అంటూ, సీతమ్మ పిలుపుకు, ఠక్కున లేచి కూర్చున్నాడు రామారావు.

Also Read : భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!