A happy life : సౌభాగ్యమైన జీవితం
సౌభాగ్యమైన జీవితం
సౌభాగ్యమైన జీవితం
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
నిండు నూరేళ్లు కలిసుండాలని
నా జీవనానికి ఆధారమైన ఈ
మంగళ సూత్రాన్ని నీ మెడలో
అందరి సాక్షిగా కడుతున్నానని
భర్త భార్యకు వేసే
మూడు మూళ్ళ బంధమే పెళ్లంటే
పతి బతుకుకు ఆధారమైన
మాంగల్యం తన నూరేళ్ళ
ఆయుష్షుకు ఆనవాలు
ఒంటరి పయనాలు జంటై
ఒకరికి ఒకరై కలకాలం
కష్టాలను కన్నీటిని
పంచుకునే బంధమే
వైవాహిక అనుబంధం
మాంగళ్య బంధం
ఇద్దరి మనసులను
ముడి వేసిన అనుబంధం
తొలచును అది సర్వ అపాయల
ఇరువురి జీవితాల
ఆనంద జీవితానికి
ఆధారమైన సూత్రమది
సౌభాగ్యానికి ప్రతిరూపమది
పసుపు తాడే కదా అని చులకన చేసి
విలువియ్యక సంప్రదాయాలను మంట కలిపి
కొందరు
తీసి పక్కనెట్టి
దర్జాగా తిరుగుతున్నారు.
సమాజమా కళ్ళు తెరిచి చూడుమా
పాశ్చాత్య సంప్రదాయాలకు
లొంగి భారతీయ సంసృతిని
మరిచిపోకుమా
Also Read : ఆలు మగలు