మిత్రుడు
కష్టాల సంద్రంలో
మునిగిపోతున్నప్పుడు
నావను ఒడ్డుకు చేర్చిన
తెరచాప లా
నా జీవితంలో
కష్టాల కన్నీళ్లను తుడిచి
నా మోము పై మళ్లీ చిరునవ్వులనే
పువ్వులు పూయించి
నా కన్నీళ్లను
ఆనంద భాష్పాలుగా మార్చి
నాలో మేఘాల్లా
కమ్ముకున్న భయాలను
చిరుగాలిగా చెదరకొట్టి
నాలో ధైర్యమనే వెలుగును
ఆత్మవిశ్వాసనే బలాన్ని అందించి
అన్ని వేళలా నాకు
అపద్బాంధవుడిలా
మిగిలావు మిత్రమా
Also Read : ఆపద్భాంధవుడు