మొదటి అడుగు
మొదటి అడుగే చెప్పెను ఆగవద్దని యెపుడు
మొదటి అడుగే నడిపెను సాగమని నన్నెపుడు
మొదటి అడుగే చూపెను ఆ దూర గమ్యంబు
మొదటి అడుగే నింపెను ఆనితర ధైర్యంబు
ఆగవద్దురా ఎపుడు అలసి , మొదటి అడుగుతో
ఆగితే గమ్యంబు అలవికానిదియే యగును
ఆగవద్దుర నీవు సుదూర గమ్యమును జూచి
అడుగు అడుగు కలిపి అవధులన్ని దాటు
చీమైన చేరునుర బెదరక కొండ శిఖరము పైకి
నీమముతో అడుగేసి ఉరకరా మునుముందుకు
గమ్యంబు చేరాక మొదటి అడుగు నెపుడు
నీవు మరువ వద్దు
సత్యంబు సోదరా , వెనుతిరిగి చూడగ
మొదటి అడుగే ముద్దు
Also Read : అడుగులో అడుగు