వెలుగు రేఖ
సాంప్రదాయపు కోవెలలో
సరిగంగ స్నానాలు
కలిసి బ్రతికే క్రొత్త జంటకు
సరి క్రొత్త సూత్రాలు
నా జీవన స్రవంతి లో
నవరాగపు భావాలు
శుభ తరుణ సమాగంలో
సుళభ తర సూత్రాలు
ఎచ్చోటనో పుట్టి పెరిగి
నా చెంతన చేరె చేడియ
ఏడడుగులు వేసి నీవు
నా జీవన వెలుగు రేఖ వయ్యావూ
అందుకే నేమో నా మనసు పలికె రాగమొకటి
మమ జీవన హేతునాం
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం,అని
Also Read : జీవితానికి ఆధారం