మమ జీవన హేతునా
జన్మదాతలకు త్రికరణ శుధ్ధిగ సేవ చేసి ధన్యుడనైతి
విద్యాదాతలకు వినమ్రముగ కృతఙ్ఞతలు తెలిపి కృతార్థుడనైతి
ఉదరపోషణార్థమై ఉత్తమ కొలవున చేరి విజయుడనైతి
దాంపత్య జీవన సాఫల్యార్థి నై సంసారాబ్ధిన మునిగితి
పతిగ,పితగ ,పితామహు నిగ పలు పాత్రలు పోషించితి
కొలువు విరమణ తదుపరి సాహితీసేవలో లగ్నమైతి
కొలచితి సభక్తి “శతమానం శక్తి నిమ్ము నారాయణా!”
ఇక, జనసేవయే మిన్న యని చేతునా “మమ జీవన హేతునా!”
Also Read : ప్రయత్నం