సహనశీలి
కష్టంలో నష్టంలో తోడు నిలిచేవాడు
బాధలో దు:ఖంలో విడువనివాడు
మనిషిగా మనసుతో ఆలోచించేవాడు
మనసులోని బాధను తొలగించే మార్గాన్నిసూచించేవాడు
మాటలతో మంచిని చేతలలో
నేనున్నాననే భావనని కలిగించేవాడు
ఎవరేమన్నా ఎలాంటి స్థితి ఎదురైనా
స్నేహాన్ని వదలని వాడు
నలుగురిలో నాస్నేహితుడని గర్వంగా పలికేవాడు
కులం మతం జాతి భావనలేక
స్నేహానికి విలువిచ్చేవాడు
పంతాలకు ఆహానికి స్థానమివ్వక
చిన్నచిన్న విషయాలను పట్టించుకోక
స్నేహానికి ప్రత్యక గౌరవమిచ్చి
సహనంతో సాగిపోయేవాడు
అతడే, సహనశీలి నిజమైన చెలిమిని కలిగినవాడు
Also Read : ఒక్క మాటలో