నేస్తమా నన్ను చేరుమా
నిండు పున్నమి నాటి పండు వెన్నెలలా
సిమ్మ సీకటిని చీల్చి వెన్నెల జల్లులు జులిపే చెలిమి నే కోరుతున్నా
మదిని మురిపించి మల్లెలు కురిపించే మరువలేని మైత్రికై నే ఆశపడుతున్న
కన్నీటిని తుడిచి కష్టాలను తొలచే ఇష్టమైన చెలిమొక్కటి నా చెంతకు చేరాలని ఆశపడుతున్న
వేధించే వేదనలను
వెంటొచ్చే బాధలను రూపుమాపేందుకు నా జీవితానికొక చెలిమిని నే కోరుతున్న
నా పెదవులపై చిరునవ్వు ఎల్లపుడు
నిలబడేలా నాకు అండగా ఉండే ఒక చెలిమి కావాలని కోరుతున్న
ఆశలన్నింటికి ఊపిరి పోసి
కన్న కలలన్నీ సాకారం చేసే
చెలిమి కై నే కోరుతున్న
దూరాల తీరాలను దరికి చేర్చే
నేస్తమొకటి కావాలని కోరుతున్న
నా వెంట నడిచి నన్ను ముందుకు నడిపించే చెలిమి కావాలని కోరుతున్న
Also Read : మకరందం