అనురాగ బంధం
రెండు ఆత్మల సహవాసం
రూపు రేఖల వైరుధ్యం
విభిన్న భావాల పరస్పర సహకారం
గమ్యం ఏదయినా కడవరకు తోడుండే మమకారం
కలిమిలేముల తారతమ్యం ఎరుగని నిత్య నూతన మాధుర్యం
మనసుల సాన్నిహిత్యమే గాని ఎడబాటు లేని అనురాగ బంధం
మనుషులు దూరమైన తలపులే వారధి గా మారి చెంతకు చేరే
అసలు సిసలైన మమతానుబంధం
చెప్పకనే అర్థం చేసుకుని తొడ్పాటు అందించే నిస్వార్ధ రక్త సంబంధం
భువి పై దేవుడు సృష్టించిన వెలకట్టలేని ఋణాను బంధం
Also Read : చెలిమి అంటే