చెలిమి అంటే
చెలిమి ఒక బంధం,
నిలుపుకుంటే ఎప్పటికీ చెదరని సంయోగం
చెలిమి ఒక భావం,
అర్ధం చేసుకుంటే నిలుస్తుంది కలకాలం.
చెలిమి ఒక వ్యసనం,
అలవాటు చేసుకుంటే వదలడం కష్టం.
చెలిమి ఒక మాధుర్యం,
ఆస్వాదిస్తే గుండెలో దాని స్ధానం పదిలం.
చెలిమి ఒక యోగం,
ఇది సిద్ధించాలంటే ఉండాలి అదృష్టం.
చెలిమి ఒక భోగం,
అనుభవిస్తేనే గాని తెలియని అనుభవం.
చెలిమి ఒక వరం,
అదిస్తుంది మధురానుభూతుల సమ్మేళనం.
చెలిమి ఒక పలకరింపు,
కష్ట కాలంలో కృంగిపోకుండా ఉండడానికి ఒక ఓదార్పు.
చెలిమి ఒక స్పందన,
చక్కగా స్పందిస్తే కలిగే తియ్యని భావన.
చెలిమి ఒక కానుక,
జాగ్రత్తగా దాచుకుంటే బతుకంతా వేడుక.
Also Read : శాశ్వత బంధమై