శాశ్వత బంధమై
కన్నీళ్లకు కారణమైన బంధాలను మరువలేక
తిమిరంలో సాగుతున్న జీవితానికి గగనం నుంచి
జాలువారిన వెలుగుల తారై నిలిచింది నీ “చెలిమి”
నీ చెలిమి చెలమలో చిత్తయ్యింది నా చిత్తం
నీవు లేనిదే మనుగడ లేదన్నది సత్యం
నీ చెలిమి నా జీవితాన మరువలేని మలుపు
మిగిలిపోరాదు ఏనాటికి జ్ఞాపకమై
వేల తారల నడుమ “ప్రభగా” వెలిగెను నీ చెలిమి
పున్నమి చంద్రుని వెలుగులు నింపెను నీ చెలిమి
ఎన్నటికీ వన్నె తరగనిది నీ చెలిమి
పువ్వులోని మకరందం నీ చెలిమి
బాధలను మురిపించిన నీ చెలిమి
శాశ్వత బంధమై స్థితమై నిలిచింది మదిన
Also Read : ఒకటే హృది