కడదాక
చెలిమి సృష్టి లో తీయనిది,
కులమతాలకు అతీతo అయినది,
ఆపదలో ఆదుకునేది
కష్ట సుఖాల్లో కడదాక తోడు ఉండేది
ఆస్తులు, అంతస్తులు, వయోభేదం
ఇవేమీ అడ్డు రానిది ఈ చెలిమి
నింగికి, నేల కి మధ్య,సూర్య చంద్రుల
మధ్య,ఆత్మకి,దేహానికి మధ్య,
భగవంతునికి,భక్తునికి నడుమ నిరంతరం
కొలువు అయ్యి ఉంది నడిపేది చెలిమి
నిజమైన చెలిమి నిష్కల్మషమైన ది
మకరందం కన్నా మధురం అయినది
వెల కట్టలేని,అనిర్వచనీయమైన
మధురానుబందం ఈ చెలిమి
Also Read : చెలిమి