చెలిమి
ఏ బంధం లేని తొలి బంధమే చెలిమి
తన మిత్రుడి బలిమిని కొరేదే చెలిమి
కృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితుల చెలిమి
రాధా కృష్ణుల మధ్య ప్రేమ చెలిమి
మనుష్యులకు కష్టసుఖాలు కలిమిలేములతో చెలిమి
భార్య భర్తలకు సంసారం చెలిమి
కవికి పాఠకులకు చెలిమి
రైతులకు పంట పొలాలతో చెలిమి
నింగికి నేల కు చెలిమి
దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల చెలిమి
నేతలకు ఓటర్లతో చెలిమి
చెలియా చెలికాడు మధ్య చెలిమి
మనుష్యుల మధ్య ఉండాలి చెలిమి
మతాల మధ్య ఉండాలి చెలిమి
కులాలు మధ్య ఉండాలి చెలిమి
తోటి మూగ జీవాల పట్ల ఉండాలి చెలిమి
కృష్ణా అర్జునుల కర్ణ దుర్యోధనుల చెలిమి బంధం
కుల మత జాతి పేద మధ్య ధనిక వర్గాలు లింగ బేధాలకు అతీతమైనదే చెలిమి
చెలిమి తో అత్యున్నత స్థాయికి చేరవచ్చు
అట్టడుగు స్థితికి దిగజారానూ వచ్చు
నాకు మీకు మనందరికీ
తెలుగు ఇజంతో చెలిమి
తెలుగు ఇజానికి
తెలుగు భాష ప్రేమికులతో చెలిమి
Also Read : ఓదార్పుల ఔషధనే మిత్రుడు..!!