సమన్యాయం
సమాజంబులోనైన, కుటుంబంబులోనైన
సమర్ధత, అనుభవం, ఆచరణ, అణుకువ, ఆశయం కలిగి
గౌరవ మర్యాదలు గణణీయంగా పొందుతూ
జనమందరినీ జాగృతం చేసి
మంచి పనులు చేస్తూ
మంచిమాటలతోటి మనసుదోస్తు
కష్టసుఖాలలో కనిపెట్టుకొని ఉండి,
కయ్యాలు, వియ్యాలు కుదురుస్తు ఉంటూ
కులమతాలు లేకుండ, కుంచితాలు పోకుండ
విశదముగా విచారించి
వీరు లేదు వారు లేదు ఎవ్వరికైనా న్యాయం ఒక్కటి అంటూ సమన్యాయం సాగించేదే పెద్దరికం.
రాజులేదు పేదలేదు, రక్త సంబంధంలేదు
స్వలాభా పేక్షకు సుదూరంగా ఉంటూ
నీతిలోన న్యాయంలోన నిర్మాహమాటంగా
న్యాయం నిర్ణయించేదే పెద్దరికం
ఈ కాలంలో దీనికి భిన్నంగా వ్యవహరించటం గమనార్హం
Also Read : బంగారు మూటే