మనో మకుటం
పదవితో ప్రాప్తించిన పెద్దరికం
ఎన్నికల తుఫానులో గల్లంతైన పైకం
వారసత్వంతో వరించిన పెద్దరికం
కొత్తతరం రాకతో హారతి కర్పూరం
ఇల్లరికపు అల్లుడి పెద్దరికం
పట్టులేని ఒట్టి అలంకార ప్రాయం
కండువా తెచ్చిన పెద్దరికం
కాలక్షేపాలతో వెలిసిపోవు వర్ణం
ఎముకలేని చేతి పెద్దరికం
ఏనుగు మింగిన వెలగపండు వైనం
అధికారి అజమాయిషీల పెద్దరికం
పదవీ విరమణతో తిలోదకం
అత్తగారి నెత్తికెక్కిన పెద్దరికం
కొత్తకోడలి పారాని పాద దాసోహం
మంది మెచ్చిన పెద్దరికం
మలినమంటని మనో మకుటం
మది మందిరాన సురక్షితం
Also Read : ప్రోత్సాహం