ప్రోత్సాహం
కల్మషం లేని నవ్వుల వెనుక
పంచే ఆప్యాయతలు ఎన్నో
సాయం చేసే సుగుణం
మనిషికి ఆభరణంగా మార్చే
గత అనుభవాలతో
నేటి తరానికి మార్గదర్శమై
విలువలనే సంపదగా అందించి
పూల పాన్పులే కాదు
ముళ్ళదారుల వెంట కూడ
పయనం సాగించాలని గుర్తుచేస్తూ
నీతిదారులను వీడకూడదని
ఆపదలు పలకరిస్తే కృంగిపోక
నిన్ను తక్కువ అంచనా వేసుకోక
బాధలను ఓర్చుకుంటూ
నీలో ఉన్న బలాన్ని రెట్టింపు చేసుకుంటూ
ముందుకు సాగుతూ
విజయాలు సొంతం చేసుకోమని
నడిపించే ప్రోత్సాహమే పెద్దరికం
Also Read : అనుభవం