అనుభవం
పండిన తలల మాటు దాగిపోయి ఉండునా
పసిడిబాట తరతరాల నడిపే ఆ నైజం
మంచికి విలువేదో తెలియజేయు అనుభవం
వెలుగుకు దారిచూపు నిశి గాంచిన నయనం
మధువులొలుకు విషమిదని వారించే కంఠం
అదర్శపు విలువలతో నిండిన ఆ రూపం
విజయం నీదే అని నిను నడిపే ధైర్యం
నీ లక్ష్యపు మార్గంలో వెలుగునిచ్చు దీపం
సహనం క్షమలెపుడూ కీలకమని తెలిపేది
తరాలెన్ని గడచినా ముదిమి లేని “పెద్దరికం”
Also Read : ప్రత్యేక బిరుదు