ప్రత్యేకబిరుదు
సంపదొక్కటే సరిపోదు సమాజంలో పెద్దరికం దక్కాలంటే,
సమాజంలో గౌరవం ఉంటే దక్కేదే పెద్దరికం
తప్పొప్పులను సరిదిద్దే తత్వం
ఓర్పుతో ఒడిదుడుకులను సమం చేసే గుణశీల తత్వం
సమాజంలో బ్రతకడమెలాగో,
అందరితో ఎలా మెదలాలో నేర్పించేతత్వం
కుటుంబాన్ని ఒక్కతాటిపై నడిపిస్తుంది,
తలవంపులు రాకుండా పోరాడుతుంది
విడిపోయిన బంధాలను ఒక్కటి చేస్తుంది
కలహాలకు తావు దొరకకుండ చేస్తుంది
కులమతాల చిచ్చును చల్లారుస్తుంది
కన్నీటిని తుడిచి ధైర్యమిస్తుంది
పిల్లల బ్రతుకున క్రమశిక్షణ పెంచుతుంది
నలుగురిలో సంపాదించుకునే ప్రత్యేక బిరుదే పెద్దరికం
Also Read : స్థితప్రజ్ఞత