తోటి మనిషి
ఆపద సమయంలో మనల్ని ఆదుకోవడానికి
మానవత్వం కలిగిన తోటి మనిషి సహాయాన్ని ఎన్నటికీ మరువలేము
ఎవరికి ఏ ఆపద వచ్చిన
సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉంటే
రేపటిరోజు మన ఆపద అవతలి వాల రక్షణ అవుతుంది
జీవితం లో వచ్చిన ఆపదలను చూసి అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితే వస్తే
ఎవరో ఒకరి రూపం లో మన ఆపద తొలగిపోతుంది
ఒకరి ఆపదను మరొకరి ఆపద గా భావిస్తే
ఈ లోకం లో సగం మంది సమస్యలను నివారించిన వాళ్లమవుతాం
ఆదుకునేవాడు దేవుడే కానకర్లేదు
ఆ రూపం లో వచ్చి మన ఆపదను తీర్చే ప్రతి ఒక్కరూ ఆపద్భాందవులే
మనకోసం ఒక్కరు ఉన్నారనే ధైర్యం ఎంత విలువైనదో
ఎదుటి వారి కోసం మనం ఉన్నాం అనే భరోసా వాళ్ళకి ఉన్న ఆపదను కూడా మర్చిపోయేల చేస్తుంది
ఒకరి ఆపద మరొకరికి తక్కువగానే కనిపిస్తుంది కానీ
అది భరించేవాళ్ళకే తెలుస్తుంది ఎంత బాధను అనుభవించాం అనేది
మన కళ్ళ ముందు జరిగే ఆపదను చూసి కూడా చూడనట్టు వెళ్లే ముందు
ఒక్కసారి ఆ స్థానం లో మనం ఉంటే ఏంటి అనే ఆలోచన మనలో మొదలైతే ఏ ఆపద మన దరి చేరదు
మనల్ని మనం కాపాడుకోలేని పరిస్థితే ఎదురైతే
తోటి మనుషులం అయిన మనం ఎంతో కొంత సహాయం చేస్తేనే మనిషిగా పుట్టినందుకు సార్థకం అవుతుంది
Also Read : అమ్మతనం