Life Is a Constant Struggle : బ్రతుకు నిత్య సమరం
బ్రతుకు నిత్య సమరం
బ్రతుకు నిత్య సమరం
ఉన్నవాడికి
తనకున్నది చాలక అనుకున్నది అందక
ఆశ చావక ఆరాటం తీరక
మనసుకు పిడికెడు శాంతి కరువు
కోట్ల కరెన్సీ నోట్లున్నా కంటి మీద కునుకు రాక బ్రతుకు బరువు
లేనివాడికి
మెతుకు నోచని బ్రతుకులో
కడుపు కింత కూడు దొరకక
గంజి నీళ్ళ రుచితో అర్ధాకలి చల్లారక
దినదినమూ పస్తులాయె
అంతులేని అవస్థలాయె
తరిచి చూడ
ఆశ చావకో ఆకలి తీరకో
మనిషన్న ప్రతివాడికీ
ఏపూటకాపూట బ్రతుకొక సమరమే
శాంతి-సౌఖ్యం గగన కుసుమమే
Also Read : సార్ధకం
