శూన్యం
బాధలనే నదిలో బంధీగా మారి
సంతోషమనే ఒడ్డు తెలియనప్పుడు
అవకాశం కోసం చేసే ప్రతీ ప్రయత్నం
జీవన సమరమే
సమస్యలనే ఊబిలో కూరుకుపోయినప్పుడు
బయటపడే ఊడ కోసం సాగించే సంఘర్షణ
జీవన సమరమే
మాటలతో ఒకరి మనసు దోసుకోవాలన్నా
నిబద్ధత గల మనిషిగా
సమాజంలో నిలబడాలన్నా
నిత్యం జీవన సమరం సాగించాలి
తల్లి గర్భం నుండి బయట పడిన క్షణం
తొలి ఊపిరి సొంతగా తీసుకోవటం మొదలు
ప్రాణం వదిలే వరకూ
నిత్యం వేసే ప్రతీ అడుగు జీవన సమరమే
సమరంలో నెగ్గితేనే జీవితం సాఫల్యం
అపజయం పొందితే జీవితమే శూన్యం
Also Read : జీవన సమరం
