A Weapon Without Death : మరణం లేని ఆయుధం

మరణం లేని ఆయుధం

మరణం లేని ఆయుధం

‘అమ్మ’ అనే పిలుపు జీవితానికి ఉనికిని ఇస్తుంది
‘అ’ కారంతో మొదలయ్యే అక్షరమాల బ్రతుకును ఇస్తుంది
భాష ఏదైనా మరణం లేని ఆయుధం అక్షరమే
వేలవేల సూర్యకిరణాల కాంతులను నిక్షిప్తం చేసుకుని
విశ్వమానవాళికి వెలుగులు పంచే జ్యోతి అక్షరమే
కూడబెట్టిన ఆస్తిని కుడుచువారు కొల్లగొట్టుకు పోవచ్చు
దాయాది మచ్చరాలు కాయాన్ని కడతేర్చనూ వచ్చు
కడుపులోని అక్షర లక్షల కబళించ సాధ్యమెవరికి?
విద్య ఇచ్చు వినయమును దోచు దొంగలెచటగలరు?
అమ్మ ప్రేమను పాశము వేసి లాగగల యమభటులు లేరు
అక్షరానికి మరణాన్ని కలిగించు మందులు భువిని లేవు
కత్తి కన్న పదునైన ఆయుధము కలమన్నది కాదనలేని సత్యం
పంచుకొలది పెరుగు ధాన్యమే అక్షరపు పంట
ధర్మము తప్పక మనుజుడు కూడబెట్టగల ధనమే అక్షరము
క్షరములేని మధురామృత భాండమే అక్షరము
అక్షరసుధలను పంచు, అవనిన నిరక్ష్యరాస్యతను వధించు.

 

Also Read : జ్వాల

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!