అక్షర సమరం
నరమేధం జరగలేదక్కడ
రక్తపు బొట్టు నేలపై జారిందే లేదక్కడ
కత్తులు దూస్తుంది లేనే లేదెక్కడ
యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ
శ్రమజీవులు స్వేదం చిందించిన నేలపైనే
సమ సమాజం స్థాపించాలనే సంకల్పంతో
లిఖించ బడుతున్న అక్షరం
సృష్టించిన చరిత్రకు శ్రీకారం ప్రజ్వరిల్లుతుంది.
నవ శకానికి నాంది పలుకుతుంది.
కుహానా నాయకులు కుయుక్తులు
దోపిడీ వ్యవస్థ పునాదులు తెగిపడుతున్నాయ్.
తరతరాలుగా సాగుతున్న
అనుభవిస్తున్న అధికారం,అంగబలం.
ఒక్క సిరా చుక్క సృష్టించిన సునామీలో
కొట్టుకుపోతున్నాయ్.
సిరా చుక్కలో పురుడోసుకున్న అక్షరం.
జన జాగృతి కోసం నడికట్టు బిగిస్తుంది.
దొరలకు దాసోహమంటూ మ్రోక్కిన చేతులు
పిడికిలి బిగించి
అక్షర భావాలను నలువీధుల్లో ప్రతిధ్వనింప చేస్తుంటే
నిరాశా నిస్పృహలతో
నిత్యం ఎదలో సంఘర్షణతో తల్లడిల్లిన
పేదవాని ఆధరాలు చిరునవ్వులు చిందిస్తున్నాయ్.
అక్షరమే ఆయుధంగా కవి సమాజంలోని
రుగ్మతలపై సమర శంఖం పూరిస్తుంటే.
Also Read : అక్షర ఆయుధం
