సిరా చుక్క
అమాయకత్వాన్ని ఆధిపత్యం తన గుప్పిట్లో బంధించగా
అణిచివేయబడిన చీకటి బ్రతుకులకు పొద్దు పొడుపునై
కర్కశత్వం కురిపించేటి విషాదానికి
తిరుగుబాటు తోవ జూపగా విప్లవ నాదాన్నై
హక్కులను కాలరాసే అధికారా దాహానికి
నిరాశన నలిగే హృదిన పెల్లుబీకే ఆక్రోశపు కెరటాన్నై
అవినీతి అందళమెక్కి రాజ్యమేలుతుండగా
అగ్నిపర్వతాన దాగిన లావాలా రగిలే కార్చిచ్చునై
అన్యాయమే విస్తారమై విజృంభిస్తుండగా
సుడిగుండాన దాగున్న ముంచేసే ఉదృతాన్నై
అవని అణువణువునా అధర్మమే ఆక్రమించగా
తుఫానల్లే చెలరేగి తుంచేసే భీభత్సాన్నై
మన్నును నెరిపి మెతుకులను పండిస్తుండగా
దళారీ దౌష్టీకపు దౌర్జన్యంతో వారి కడుపును కొడుతుండగా
శ్రమ జీవులు స్వేదము మాటున దాగున్న కన్నీటిని కలము సిరచుక్కలుగా
జన హితముకై అక్షర అస్త్రాన్ని సంధించి ఇక్కట్లను బాపేలా విరచిస్తున్న ఈ కవనాన్ని
Also Read : అక్షరమే ఆయుధం