కంటకప్రాయమే
ఆశల నిచ్చెనల ఎగబాకే మనిషికి
దిగజార్చేలా ధరలు పట్టీ
క్షణ క్షణానికి దిన దినానికీ
ప్రవర్థనమానమయ్యే సూచికగా
ఏది కొందామన్నా కొరివిలా సెగలాయే
ముట్టుకుంటే మూడు చెరువుల నీళ్లు
తాగేంత బరువాయే జీవన సమరం
సామాన్యుడి సణుగుడికి భరోసా లేకపోయే
పెత్తందారీకి పట్టం కట్టే చుట్టే చట్టాలన్నీ
సమ సమాజానికి కంటకప్రాయమై తంటాలే
ఎక్కడమ్మా ధరల జాడ అంటే
బెంబేలెత్తించిన చుక్కలనంటిన దారులాయే
దిగివచ్చే పురోగతి కరువాయె
అలసత్వపు ఆచరణలో మునకేసే దౌర్భాగ్యం
బడుగు జీవుల నెత్తిన భారమై నిలదొక్కోలేనిదై
అడగడుగునా ఆర్థిక ఆంక్షల మధ్య నలుగుతూ
Also Read : గంజైయినా చాలు బిడ్డా