నవరస మాధురి
మల్లెపూల మకరందంలా మధురమైనది
సంపెంగపూ సుగంధంలా సొగసైనది
మంచి గంధపు పూతలా మనసైనది
జాజుల గుబాళింపులా జగమెరిగినది
గోదావరివోలె గంభీరమైనది
కిన్నెరసాననివోలె కులుకులొలుకునది
కృష్ణమ్మవోలె కమనీయమైనది
నెల్లూరి నెరజాణవోలె నవరసాలొలికించునది
సాహితీ కన్యకను సాకారము చేయునది
సంగీత నాట్యాల రంజింప చేయునది
అన్నమయ్య పద కవితలల్లినది
త్యాగయ్య రామభక్తికి సొంపలదినది
రామదాసు రమ్య రామ కీర్తనల్లోనిది
నండూరివారి ఎంకి ప్రేమ తత్వంలోనిది
గరికపాటివారి చమత్కార ప్రవచనంలోనిది
దేశభాషలందు లెస్స అయిన నా తెలుగు భాష
మనసులనలరించి మమతలు పండించునది
మనసులు కలిపి మనుషులనేకం చేయునది
చక్కనైనది ,మధుర మనోహరమైనది
అందమైన ఆనందనందనం
తేనియల్ చిందు నా తెలుగు భాష.
Also Read : మన తెలుగు