కస్తూరీ తిలకం
మన తెలుగు అవును మన వెలుగు
మాతృ భాషగా ఇంటింటి జిలుగు
వెన్నెలై చల్లనిది తెనేకన్న తీయనిది
అమ్మ ప్రేమలా కమ్మనిది మన భాష అది
అమ్మ నాన్న అని ఈ భాష లో పిలిచాను
నా భాష ను అంత మక్కువ తో వలచాను
ప్రతి పదము సౌలభ్యము మధుర సుందరము
వినటానికి కర్ణ మనోహరం మాటలు మంజు మోహనం
దేశ భాషల్లో తెలుగు లెస్స భాషకు లేదు ఒంక
కావ్యాలు ప్రబంధాలు,గీతాలు,కవిత్వాలు,పద్యాలు
గంగా ఝరిలా పారుతు తేనె ప్రవాహాలు
పది నోళ్లలో నానుతూ మెరిసిన పావన చరితాలు
తెలుగు పాటలు,కథనాలు,పదాలు అమృత గుళికలు
గుడులు గోపురాలు,శిల్పాలు,చిత్రాలు,నృత్యాలు
తెలుగు వీరులు,రాజులు,రాణులు,పల్లె పట్నాలు
తెలుగు తనానికి చారిత్రక అద్భుత దృష్టాంతరాలు
ఎన్ని భాషలు వచ్చినా మాతృ భాష నా తెలుగు లో
మనసు విప్పితే అదే మనసుకు సంతసం
తెలుగుదనం గల గల గోదారి పారవశ్యం
తెలుగుదనం మృదు చైతన్య కృష్ణమ్మ తన్మయత్వం
తెలుగుదనం శివ కేశవ మిళిత భక్తి చిన్మయం
తెలుగుదనం తన జాతి గౌరవానికి కస్తూరీ తిలకం
Also Read : మన తెలుగు