నా తెలుగు
తెలుగంటే అమ్మంత ప్రేమ
తెలుగంటే అమ్మలాంటి ప్రేమ
తెలుగంటే ఉగ్గుపాల ముచ్చట
తెలుగంటే తీపితేనేల పాల ఊట
మన తెలుగంటే సంక్రాంతి రంగవల్లిక
ఊగాది పండుగనాటి షడ్రుచుల సమ్మేళనం
దసరా నాటి జమ్మిచెట్టు మీది పాలపిట్ట
దీపావళి నాడు ఆకాశాన మెరిసే తారాజువ్వ
మన తెలుగు గడ్డపెరుగు మీది వెన్నెముద్ద
స్వచ్ఛమైన కృష్ణగోదావరి నీటి ప్రవాహం
అడవిన విరభూసిన బొండు మల్లెపువ్వు
కల్మశం లేని పసిబిడ్డ మోములోని చిరునవ్వు
తెలుగంటే శ్రీగంధుపు సుగంధం
తెలుగంటే తేనేలొలుకు మకరంధం
తెలుగంటే ప్రేమను పంచే అనుబంధం
తెలుగంటే వెన్నెల వెలుగుల అందం
Also Read : జ్ఞాన జ్యోతి