తొలికరి
తొలికరి పొద్దులో వికసించే రవి కిరణం
తల్లి ఒడిలో నిద్రించే బిడ్డ జననం
మట్టిని ముద్దాడుతూ లేచే వృక్షం
ఎందరు ఎదిరించిన నిలబడే సాక్ష్యం
ఎన్నో ఏళ్లకి కరుణించిన మోక్షం
ఆటలో తగిలే మొదటి గాయం
గెలుపు కోసం చేసే త్యాగం
ప్రతి ఫలం ఆశించని సహాయం
అవినీతిని అడ్డుకునే ధైర్యం
నిజాన్ని నిలబెట్టే ప్రాణం
యుద్ధంలో ఎదురొడ్డి నిలబడే శౌర్యం
ఒడి దుడుకులు దాటే గానం
రెక్కలు లేని పక్షి చేసే సాహసం
అందరిని కలుపుకునే గొప్ప మానవత్వం
ఈ మొదటి అడుగులు దాటిన జీవులు
గొప్పగా ఎదిగిన వీరులు
Also Read : మొదటి అడుగు