సమిధ
కన్నీటి పొరల నిండిన అభాగ్యులకు
కడుపు నిండా తిండిలేని అనాధలకు
దిక్కులేని స్థితిలో చిక్కుకున్న చిన్నారులకు
చేతనైన సాయం అందించే ఆ వీరులకు
ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు
మరెన్నో ధీనతలతో కునుకు దూరం కనులకు
ఎన్నెన్నో మనసులు కరుగును వారి కలతలకు
చేతనయిన సహాయం అందిచటమే ఆ నిర్భాగ్యులకు
దూరం పాటించు ఆ కుళ్లు రాజకీయాలకు
సమయానికి చేయి అందించు నిస్సహాయులకు
సమయం కాదిదని గుర్తించు వంతులకు
నేను సైతమంటూ అమృతం అందించు అభాగ్యులకు
సమిధవై నువ్వు కాలనక్కర్లేదు అందులకు
వెలుగును ప్రసాదించు ఆ అంధులకు
మంచితనంలో ఆదర్శంకావాలి ఇతరులకు
మాతృభూమి రక్షణకై పోటీగా నిలవాలి వీర జవానులకు
Also Read : అక్షరార్చన
