ప్రతి ఓటమి గెలుపే
అందమైన చంద్రుని
మబ్బులు కమ్మేసినా
వేడిగా ఉండే సూర్యుడిని
మేఘాలు ముసురుకున్నా
తిరిగి అత్యుత్సాహంతో
సూర్యచంద్రులు ఉదయించక మానరు
తమ దినచర్యలను ఆరంభించక ఆగరు
వారి దినచర్యల్లో ఉదయాస్థ మయాలు ఎంత సహజమో
మానవ జీవితాల్లో గెలుపోటములు అంతే సహజం
సహజంగా సంభవించే వాటికి స్పందిస్తూ
ఓటమికి. క్రుంగి పోతూ
గెలిస్తే పొంగిపోతూ
ఆవేశకావేశాలకు లోనౌతూ
అమూల్యమైన జీవితాన్ని
క్షణికావేశ నిర్ణయానికి బలి చేయకండి
నిండు జీవితాన్ని అర్ధంతరంగం ముగిస్తూ
బ్రహ్మ్ రాతను తిరగ రాయకండి!
పడినా ప్రయత్నం కొనసాగిస్తే
విజయం వరిస్తుంది అన్న అబ్దుల్ కలాం సూక్తిని
స్ఫూర్తిదాయకంగా తీసుకుని
పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా చేసుకుని
ప్రతికూల స్థితుల్లో మోడైన చెట్టు
అనుకూల స్థితుల్లో చిగురించేందుకు వేచియున్నట్లుగా
ప్రతి మనిషి ప్రతికూల పరిస్థితుల్లో తలవంచుతూ
అనుకూల పరిస్థితులకై ఓరిమితో నిరీక్షించాలి
మొక్కవోని మనోదైర్యంతో
అంతులేని ఆత్మవిశ్వాసంతో
ప్రతి ఓటమిని మరో. గెలుపుకు పునాదిగా చేసుకుని
విజయపధం వైపు ముందడుగు వేయాలి
నవ్య జీవనానికి శ్రీకారం చుట్టాలి
Also Read : అంకురం