Inspirational story : అంకురం

అంకురం

 

అంకురం

ఏనాడైనా
బీజం వృక్షపరిణామంలో
దుఃఖించిందా?
ఓడిపోయిందా?
ఎన్నో అడ్డంకుల్ని
ఆసరాగ చేసుకొని
ఆకాశం వైపుకి ఎదని చాచింది
అంకురం- అంబరమై
అవనికి నీటినీడనిచ్చింది
జనులకి ప్రాణ’భిక్ష’ పంచింది
అయినా అంకురానికి
గెలుపు గర్వం లేనే లేదు
అంకుర ఉనికే లేదు
ఓటమి లేని ప్రతి బీజానిది
గెలుపు చరిత్రే
మనిషికి స్ఫూర్తికథే
బీజంలోని చైతన్యశక్తి
మానవునిలోని సంకల్పశక్తి
గెలుస్తుంది-గెలిపిస్తుంది

Also Read :  బతుకు భ్రమణం

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!