చదరంగం
ఓటమెరుగని ధీరుడనై
గెలుద్దామనుకున్నా
అనుకున్న ప్రతిసారీ ఓడిపోతున్నా
అయినా ఓటు వేస్తునే ఉన్నా
నోటు వద్దన్నా, నజరానాలకు లొంగనన్నా
నోటాకు వేసిన్నాడైనా గెలుస్తాననుకున్నా
అయినా ఓడిపోతున్నా
ఇజం ఉన్నోడికి బలం బలగం
బలగానికున్న బంధుత్వం జెండా
ఆ జెండా కో లక్ష్యం గెలుపు
ఆ గెలుపు కున్న దారి అడ్డ దారి
అక్కడే లక్ష్యం వెనుకబడింది
అందుకే నా ఓటు ఓడిపోయింది
ఇలాగైతే నా గెలుపింకా మొదటి మెట్టు మీదే
ఊరు పొమ్మంటుండే కాడు రమ్ముంటుండే
ఆశయం కొమ్ము కాయడం ఇంకెన్నాళ్ళు?
విలువల సాధన సమరంలో నలిగి పోతున్న ఐక్యత
విజయం సాధించుటెప్పుడో
నా ఓటు గెలిచేదెప్పుడో
Also Read : గెలుపోటములు