Cycle of life : గెలుపోటములు
గెలుపోటములు
గెలుపోటములు
ఆటలోనూ గెలుపోటములు
జీవితంలోనూ కష్ట సుఖాలు
అన్నింటిలో గొలుపొంది నా కూడా ఆశల ప్రపంచంలో
దరి చేరని తీరాలెన్నో.
ప్రయత్నం చేయక పిరికి వాడివవుతావో
ఆడిన ఆటలో గెలుపు ఓటమిలు తలిచి
ఓటమికి బయపడి ఒంటరి అవుతావో
గెలుపును పొంది విజేతగా నీలుస్తావో
నీ హస్తం నందే నిలుచున్నవి చూడు మిత్రమా.
కాలగమనంలో ఓటమి గెలుపు కావచ్చు
గెలుపు ఓటమి కావచ్చు కానీ
జీవితం అనే ఆటలో ఓడేది మానవ జీవితం
కాలాన్ని కూడా గెలిచేది పరమాత్మ ఒక్కడే.
గెలిస్తే అక్కడే ఆగాల్సిన పరిస్థితి
ఓడితే మరలా ప్రయత్నించే అవకాశం
ఓటమీ శాశ్వతం కాదు
గెలుపు శాశ్వతం కాదు విధి ఆడే వింత నాటకంలో.
ఓటమి విలువ తెలియని నాడు
ఎన్ని విజయాలు వరించినా వ్యర్థమే
ఎన్ని సార్లు విజయం వరించినా
జీవిత సంద్రంలో మునగాల్సిందే అదే జీవిత చక్రం.
Also Read : జీవిత అంకాలు