Satyam Shivam Sundharam : సత్యం శివం సుందరం
సత్యం శివం సుందరం
సత్యం శివం సుందరం
సృష్టి స్థితి లయ కారకులు
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
సత్యలోకమే బ్రహ్మగారి నివాసం
సత్యమంటే కళ్లెదుట కనిపించే వాస్తవం
సత్యo అనేది అజరామరం.
సత్యమార్గం అనుసరిస్తే మనిషికి చేకూరు ప్రశాంతత.
శివం అంటే శుభం.
శివం లోనే ఉంది గురుతత్వం.
దక్షిణామూర్తి అందుకు నిదర్శనం.
ఆద్యంతాలు లేనివాడు శివుడు
కల్మషం లేనివాడు శివుడు
కాలాంతoములో సృష్టిని అంతం చేసే వాడు శివుడు
గల గల పారే సెలయేరు నయనాల కు మనోహరం
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం మనసుకి ఆహ్లాదకరం
పచ్చని చెట్లు, పంట పొలం కంటికి శుభం
చల్లగా వీచే పైరగాలి తనువుకి హాయి.
పరమేశ్వరుని సృష్టి అంతా సుందరం.
త్రిమూర్తి స్వరూపమే సత్యం శివం సుందరం
మానవులందరికీ అదే ముక్తి సోపానం.
Also Read : నాతి చరామి