తెలుగే నా శ్వాస
అందమైన నుడికారాల చరుపులతో
అలతి అలతి పదాల విరుపులతో
సుందర శోభిత విరివనాన
విరబూసి పరిమళాలు వెదజల్లింది నా భాష
అచ్చు హల్లుల సమ్మిళిత సొబగులతో
అచ్చమైన అలంకార ప్రాస అల్లికలతో
తెలుగందపు కీర్తి సుగంధాలను
విశ్వ యవనికపై రెపరెపలాడించింది నా భాష
ఎందరో మహానుభావుల నిలువెత్తు విద్వత్తుకు
మరెందరో సాహితీ శ్రేష్టుల సృజనాత్మక కళకు
ఆనవాలమై అమృతాన్ని పంచింది నా భాష
కన్నతల్లిలాంటి మాతృభాష కోసం
దేహమున్నంత వరకు తెలుగే నా ధ్యాస
ఊపిరున్నంత వరకు తెలుగే నా శ్వాస
Also Read : తెలుగు తల్లి