అజరామర నా మాతృభూమి
క్రీస్తు పుట్టుకకు పూర్వమే అపూర్వ చరిత్ర కలిగినది
పాశ్చాత్య లోకం బట్ట కట్టక మునుపే పట్టు బట్టను నేసినది
జ్ఞానదీప్తితో వెలిగిన విశ్వావిద్యాలయాలకు వేదికయినది
సుభిక్ష రాజ్యల సుసంపన్న చరితతో వెలిగినదీ నా మాతృభూమి.
చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయ, శాంతి తత్వమునకు
మార్గదర్శియై, ఆదర్శియై నిలిచినది నా మాతృభూమి
ఖండ ఖండాన్తరములకు మానవ మేధస్సును ఎగుమతి చేసే
అపర సరస్వతి నా మాతృభూమి
దేశదేశాలలో కుబేరులకు దీటుగా నిలిచే
తనయుల కలిగిన లక్ష్మి నా మాతృభూమి
సమిష్టి కృషితో, స్వయం స్వాలాంబనతో
ముందుకు సాగె శక్తి నిలయ నా మాతృభూమి
ఉషోదయ సూర్యునిలా ప్రకాశిస్తూ
పున్నమి వెన్నెలలా చల్లదనానిస్తూ
మహా వృక్షంలా సేవలందిస్తూ
మహోన్నత శిఖరమై నిలబడినది నా మాతృభూమి
Also Read : పృధ్వి బాట
