పృధ్వి బాట
మాతృభూమి గర్భాన
ఆ తల్లి హృదయాన
జీవించే ఆమె వడిలోన
కసురుకోదు పరుగుడిన
పడిపోతే లాలిస్తుంది
నిలబడితే అండవుతుంది
బాధల్లో నేనున్నానంటుంది
భరోసా తానిస్తానంటుంది
పెంచిన తల్లి ఈ భూమి
జీవితాన్ని ఇచ్చిన పుడమి
జీవించడం నేర్పిన అవని
అవసరాలను తీర్చే పృథ్వి
సహజ వనరులను అందిస్తుంది
చేతనైన సాయం చేస్తుంది
ప్రకృతి అందాలను పెంచుతుంది
పరవశముతో పులకింప చేస్తుంది
Also Read : అఖండ భారతం