అమ్మ నీ రూపము
అమ్మ నీ రూపం ఆనందం పొందే చిద్విలాసం
అవనిలోన కానరాదు ఇలాంటి నందనవనం
మీ స్వరూపాన్ని వర్ణించడం మహద్భాగ్యం
మేము మీ ఒడిలో పుట్టినందుకు ధన్యులం
హిమాలయ శిఖరాలు ఉన్నత శ్రేణులు
జీవనదుల అమృత భాండాగారములు
గంగా సింధూ మైదాన వక్షస్థలములు
బిడ్డల ఆకలి తీర్చే సారవంతమైన భూములు
దక్కన్ పీఠభూమి విస్తారముగా వ్యాపించి
దక్షణ భారత త్రిభుజాకార నేల గాంచి
కనుమలను వడ్డాణము గా ధరించి
నదులకు నీటి ధారలతో జీవము తెచ్చి
ఆరావళి పర్వత శ్రేణులు అపురూపమై
నైరుతి ఈశాన్య భాగం విస్తారమై
కొండలు ప్రపంచంలోని అతి ప్రాచీనమై
రాజస్థాన్ నుండి హర్యానా వరకు ఆకారమై
నీలగిరి పర్వతశ్రేణుల సోయగాలు
కన్యాకుమారికి నీ పాదాలకు అభిషేకాలు
చిలక కొల్లేరు పులికాట్ నీటి సరస్సులు
నదీ ప్రయాణం లో విలసిల్లిన నాగరికతలు
సాగరుడు మూడు దిక్కులా కాపలాగా
ద్వీపకల్పం లో జ్యోతిగా వెలిగావమ్మ
మహోన్నత సుందర ఆకారమే నీ రూపమమ్మ
బిడ్డలకు మహోజ్వల కాంతి పుంజం నీవేనమ్మా
Also Read : వటవృక్షం