వటవృక్షం
ముచ్చటగా మూడు వైపులా జలం
ఉత్తరాన ధీటుగా ఆసేతు హిమాచలం
నలుదిక్కులా శత్రు దుర్భేద్యమైన రక్షణ వలయం
గుండెలు ఉప్పొంగే గొప్పదనం నా మాతృభూమి
పల్లె పచ్చని పైరుగాలుల వింజామరలతో
పట్టణ సాంకేతిక పరిజ్ఞాన కాంతులతో
దిగ్దేశాలను సైతం దిశానిర్దేశం చేస్తూ
అభివృద్ధి పథంలో భాసిల్లుతోంది నా మాతృభూమి
అక్కున చేర్చుకునే వివిధ మతాల కొమ్మలతో
ఆకలి తీర్చే భిన్న కులాల ఫలాలతో
ఆశ్ఛర్యపరిచే విభిన్న సంస్కృతుల పత్రాలతో
ఎంతో ఘన చరిత్ర గల వటవృక్షం నా మాతృభూమి
Also Read : నా దేశం