దిక్సూచి
సింధునది పరవళ్లతో
నాగరికత విరబూసిన
వేదాలకు పుట్టినిల్లుగా
ఇతిహాస పరిమళాలను
నలుదిశలా వ్యాప్తంపజేసి
భిన్న సంస్కృతల మేళవింపులతో
ఎందరో త్యాగధనులు నడయాడిన పుణ్యభూమి
కళలను పోషించిన రాజులు ఏలిన నేల
శత్రువుకైనా చేయి అందించి
స్నేహ పరిమళాలను వెదజల్లే కర్మభూమి
గంగా గోదావరి నదీ పరివారాలు
వేదపండితుల మంత్రోచ్చారంతో పారుతూ
త్రివర్ణ పతాకం
విశ్వవేదికపై విజయకేతనం ఎగురవేస్తూ
సస్యశ్యామలమైన నా దేశం
సంస్కృతి, సంప్రదాయలలో జగతికి దిక్సూచి
నా మాతృదేశం భారతదేశం
Also Read : పెంపకం