పెంపకం
వేసే అడుగులు తడబడకుండగ
చూసే చూపులు మసిలేకుండగ
చేసేపనులను చెడిపోకుండగ
పూసే పూవుల చిదిమేకుండగ
పిల్లల పెంచే పెంపకమే గదా
దేశభవితకిల శుభకరమౌ సదా .
కాని పనుల సరికావని చెప్పక
అన్నింటికి వత్తాసు పలుకుచు
పిల్లలను వెనుకేసుక వచ్చే
కంపర మెత్తే కాలము పోవలె
పెంపకమున పెనుమార్పులు రావలె
పోరు నష్టమని పొందు లాభమని,
పరోపకారమే పుణ్య ప్రదమని,
పరపీడనమే పాప హేతువని,
సత్య మొక్కటే సత్సా ధనమని,
అంతిమ విజయము ధర్మముదేయని
ఢంకా కొట్టి తెలుపుతూ ధైర్యం పెంచే
పెంపకమే ఈ నాడు కావలెను.
Also Read : అమ్మ భాష