అమ్మ భాష
అంటుకట్టు శాకోపశాకలై నిగారించి
పూలు పూసి పరిమళించేలా
కొత్తరెమ్మలు తలెత్తుకోవాలి
నారు పోసి నోరు నీరు పోయరాని
ఎంతకీ విరియని పాలమొగ్గలై
మురిపాల ముగ్గులై అతి గారంగా
అమ్మఒడినే అంటుకుండి పోయి
అంటుకట్టినా అంటని విలువలు
తరానికి సారించబడకపోతే ఎందుకూ ?
తోటమాలి లోపాలు పాలరేకుల మీద
మరకలై పాలిపోతాయి
ఇవాళ దేశి తెలుగు వనమంతా
విదేశీ పరమై శాకకో రంగు పూవు
పూసినట్టు పరభాషల సోకు సోగలు
పెంపకాన్ని పంపకాలేసుకుంటూ
పూలకుండీలను ఖండాలు దాటిస్తున్నాయి
Also Read : మూడుపువ్వులు ఆరుకాయలు