Life Motivational Poem : మూడుపువ్వులు ఆరుకాయలు
మూడుపువ్వులు ఆరుకాయలు
మూడుపువ్వులు ఆరుకాయలు
నాణ్యమైన కమ్మటి విత్తులు నాటి
చక్కటి పెంపకంతో సేద్యం చేసి
మంచివిలువల గల నాణ్యమైన పంటను పండిస్తే
మూడుపువ్వులు ఆరుకాయలుగా సమాజం వికసిస్తుంది
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
పిందె పూసినపుడే మంచి నడవడికను
కుటుంబనావ అందించగలిగితే సమస్యల సుడిగుండాలను ఎదుర్కొనే
ప్రశాంత వ్యక్తిత్వం అంకురిస్తుంది
ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు
పొందికైన పూలతోటలో విరిసిన
మనిషి ప్రతిభా సువాసన
పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది
అస్తవ్యస్తమైన సమాజ అనుబంధాలు
చిగురించి మొగ్గ తొడగాలంటే
కుటుంబాలలో నైతికత వర్ధిల్లాలి
Also Read : నాన్న