నాన్న
నేను పుట్టినప్పుడు నా ఆశకిరణం మా నాన్నే
నేను పుట్టినప్పుడు
మా అమ్మ పుట్టిందని నీ కంటి నుండి వచ్చిన ఆనంద భాష్పాలు చూసా
నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి మహాలక్ష్మి వచ్చిందాని నీ ముఖం లో వికసించిన పుష్పం చూసా
పసి ప్రాయం లో నా తప్పటాడుగులకు ఆనందించే వాడు నాన్న
నా జీవితం లో తప్పు బాటలను సరిచేసి నడిపేవాడు నాన్న
నా ఆనందానికై గుర్రపు బొమ్మాయే వాడు నాన్న
నమ్మకమే నాన్నగా నడిపించిన నా తొలి అడుగులు
నేర్పించిన నా తొలి పలుకులు
ప్రయత్నించినా ప్రతి మలుపులో నేనున్నాని ప్రేమను చూపించావు
నాకు ఓనమాలు నేర్పడానికి బెత్తము పట్టిన గురువుగా మారినావు
నాకు మంచి విద్య అదించాలని మంచి విద్యాలయాలకు వెళ్లాలని
నా అభ్యున్నతి కోసం నీ రక్తాన్ని చిందించావు
నా గెలుపు కోసం చెప్పులు అరిగేలా తిరిగావు
చల్లని వెన్నెలను కురిపించే చందమామలో నీ మనసును చూసా
ఎగిసిపడే అలలలో నీ పోరాటాన్ని చూసా
చీకట్లని చీల్చుకొని వచ్చే భానుడిలో ధైర్యాన్ని చూసా
పరిమలించే పుష్పం లో ఉన్న నీ సద్గుణలను చూసా
నన్ను పెంచడం లో మా నాన్న ఎప్పుడు రాజే
తాను కొవ్వొత్తిలా కరిగిపోయి నా జీవితం లో వెలుగులు నింపాడు
మా నాన్న ఉన్నంత వరకు నేను ధనవంతురాల్నే నువ్వు లేని జీవితం శున్యం నాన్న
Also Read : పెంపకం