పెంపకం
జవసత్వాలు నింపి
మమకారాలు మాధుర్యాలు తేలియాడే
మనోగోళమొకటి నిర్మించి
మెదల్ల లో చొప్పించాలి.
ఏ పుస్తక మొకటి వ్రాయబడలేదు
పెంపక కొలతలుతో
జీవం నింపటానికి శరీరాల్లో.
చెట్టుకు ఏం నూరిపోశారని
పరోపకారమే పరమావధిగా
బ్రతుకుతుంది.
చిత్రి పట్టిన
నీతిని, న్యాయాన్ని
ఉగ్గు పాలతో రంగరించి పోయాలి
నీడనిచ్చే ఊడలమర్రిలు
పుట్టుకొస్తాయి
సజీవకణాలతో.
మనిషెందుకో
తర్ఫీదుల చట్రం లో
సహజాన్ని నులిమేస్తున్నాడు
సమాజాన్ని యంత్రశాలలా
మార్చేస్తున్నారు.
పెంపకం
పంపకాలు కోసమే అన్నట్టు
తలా ఒకర్ని పంచుకుంటున్నారు
ఏమెట్టి పెంచుతున్నాము.
మారుతున్న కాలధర్మమా
ఏం బోధిస్తే
అదే మనకిస్తున్నారా
Also Read : నవ శకానికి నాంది