The ladder of life : జీవిత సోపానం

జీవిత సోపానం

 

జీవిత సోపానం

బుడి బుడి అడుగులు నేర్చేవేళ

వెన్నంటే అమ్మ ఉంటుందనే నమ్మకమే నా బలం.

ఎదుగుతున్న నాకు.

సత్ప్రవర్తన తోడు చేయగల నాన్న,

నా వెన్నుముకలా నిలుస్తాడనే

మనోధైర్యంమే నా బలం.

 

సమాజంలో

సముచిత స్థానం దక్కాలంటే

విద్య వలనే సాధ్యమని

ప్రతి క్షణం గుర్తుచేసే నా గురువులే

నాకు మార్గనిర్దేశం చూపగలరనే

విశ్వాసమే నా బలం.

 

వైవాహిక జీవితంలో

సమస్యల సుడిగుండాలును

సునాయాసంగా దాటగలననే భరోసా ఇస్తున్న

నా అర్దాంగే నా ఆర్థిక స్థితికి బలం.

 

జీవిత చరమాంకం

మనో వ్యాకులత చెందకుండా

తృప్తిగా గడిపేలా ప్రణాలికలు రచించే

నా బిడ్డలే నేడు నా బలం.

 

విద్యా వినయం,

సంస్కృతి సాంప్రదాయం

నీతి నియమాలే ,తరగని సంపదలకు మూలం.

అహః వీడిన జీవితం ధన్యం నలుగురికి ఆదర్శం.

 

Also Read : నా బలం నా తెలుగు

 

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!