నా బలం
నేనొక కర్షకుడిని
పొలందున్నే హలం నాబలం,
నేనొక ఉపాధ్యాయుడను
జ్ఞానాన్ని పంచే అక్షరం నా బలం,
నేనొక కవిని
నిజాల్ని వెలికితీసి లికించే కలం నాబలం,
నేనొక శ్రామికుడను
ఆకలి కడుపుకై కాయకష్టం నా బలం,
నేనొక జెండా~సమాజ అసమానతలకై
పోరాట విప్లవం నాబలం,
నేనొక న్యాయవాది
న్యాయాన్ని పంచే కోర్టుదేవాలయం నా బలం,
నేనొక కాలం
నమ్ముకున్నోడిని ఆదుకోవడం నా బలం,
నేనొక లౌకికం
కుల,మత వర్ణాలనక సమానత్వం నా బలం,
నేనొక వనం~స్వేచ్ఛకై పోరాడిన అమరుల పాదాలపై కుసుమాలు జల్లడం నా బలం,
నేనొక పీఠం
పేద ధనికులంటూ లేక పరిపాలన నా బలం,
నేనొక జలం
అయినవాళ్ళుగా అందరినీ సాకడం నా బలం,
నేనొక నాటకం
సమాజ అవకతవకల్ని ఎత్తిచూపడం నా బలం
నేనొక భూతల్లిని~జాతి,లింగ విభేదాలు లేక
నాఒడిలో నిద్రించే బిడ్డలకు జోలపాడటం నా బలం,
నేనొక అంగజుడను
అమ్మ నాన్నలు పంచే ప్రేమ నా బలం
Also Read : జీవిత సోపానం
