కవిత్వం నా బలం
అక్షరమక్షరం ఏరి పేర్చుకున్న
గిజిగాని గూడులా
గుండెపిట్టని కుదువపెట్టి
ఆశయపు కూతలు చిగురులు తొడిగి
కవితల చెట్టు పైనే
కునుకు తీసే తీపి కలలనెత్తావి నా బలం
అంతఃకరణ శుద్ధబీజాలు
కడిగినముత్యాల్లా
పండిన కవితా కంకుల మార్మిక కర్మ
హృదయ క్షేత్రపు హృద్య నాద
కవితా లాపనలే నా బలం
కవితా కూజితాల మెప్పుగా
సంపుటీకరించబడిన నాకవితా
పొత్తాల పురస్కార భాగ్యపు సమాజమే
నా బలం.
Also Read : నా బలం
